పంజాబ్లోని మొహాలీలో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. డేరా బస్సీ ప్రాంతానికి చెందిన ఓ మహిళపై ఇటీవల అత్యాచారం జరిగింది. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఏఎస్ఐ పర్వీన్ కౌర్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేసింది. ఆ డబ్బును బాధితురాలి ఇంటికి వెళ్లి తీసుకుంది. ఈ దృశ్యాలు వారి ఇంట్లోని సీసీ కెమెరాలలో నిక్షిప్తం అయ్యాయి. ఏఎస్ఐపై కేసు నమోదుకు డీఎస్పీ దర్పణ్ అహ్లువాలియా సోమవారం ఆదేశించారు.