డ్రగ్స్ కేసుల్లో సౌదీ అరేబియా 10 రోజుల్లో 12 మందిని తల నరికి మరణ శిక్ష అమలు చేసింది. సౌదీలో ఇలాంటి శిక్షలు విధించడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ ఏడాది ఇప్పటివరకూ 132 మందికి సౌదీ ప్రభుత్వం మరణ శిక్ష అమలు చేసింది. మరణ శిక్షలు ,తగ్గిస్తామని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2018లో హామీ ఇచ్చినప్పటికీ మరణ శిక్షలు విధించడంపై హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.