ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకో మహిళ హత్యకు గురువుతోందని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటనియో గుటరాస్ ఆందోళన వ్యక్తం చేశారు. సహచరులు లేదా కుటుంబసభ్యులే యువతులను చంపేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళల విషయంలో యథేచ్ఛగా మానవ హక్కుల జరుగుతోందని అభిప్రాయపడ్డారు. హత్యల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముందన్నారు. ఈ నెల 25న అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినం సందర్భంగా ఆంటనియో గుటరాస్ ఈ వాఖ్యలు చేశారు.