ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగాలను భారత్ ఖండించింది. ఈ ప్రయోగాలు ప్రపంచ వ్యాప్తంగా శాంతి భద్రతలను ప్రభావితం చేస్తాయని.. ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. ఈ విషయంలో భద్రతా మండలి, అంతర్జాతీయ సమాజం ఐక్యంగా ఉండాలని కోరారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు భారత్ నిరంతరం మద్దతు పలుకుతుందని స్పష్టం చేశారు.