నరసాపురం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆక్వా సమస్యలపై మాట్లాడకపోవడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు మేలు జరుగుతే, వైసీపీ ప్రభుత్వం లో ఆక్వా రైతులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులు నష్టపోయారంటూ వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆక్వా రైతులకు ఏం మేలు చేసిందో స్థానిక ఎమ్మెల్యే చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో రేపు మంగళగిరిలో ఆక్వా రైతుల సమ్మేళనంలో చంద్రబాబు ఆక్వా సమస్యలపై మాట్లాడతారని కోళ్ల నాగేశ్వరరావు తెలిపారు.