ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకు మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దించుతున్న మహిళా నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 23, 2022, 02:53 PM

బయటకు రాజకీయ నాయకురాలి అవతారం.. లోపల ఘరానా మోసాలు.. ఇది విజయవాడ పటమటలంకలో ఓ మహిళా నేత తీరు. విజయవాడ, పడమటకు చెందిన మహిళా నేత తనవద్దకు వచ్చే మహిళలకు మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దించుతున్నారని నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటాకు ఫిర్యాదు అందింది. గతంలో ఈ మహిళపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో అనేకసార్లు ఫిర్యాదు వెళ్లినప్పటికీ అధికారపార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఆమెపై ఎటువంటి చర్య తీసుకోలేదు. అయితే ఆమె ఆగడాలు మితిమీరిపోవడంతో బాధితురాలు నేరుగా పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ సమగ్ర దర్యాప్తు చేయాలంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఆదేశించారు. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఇప్పటికే ఆ మహిళ పలువురు యువతులను మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి దించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.  ఆ మహిళ పటమటలో ఓ వస్త్ర దుకాణం నిర్వహిస్తోంది. ఆ షాపుకు వచ్చిన యువతులకు మాయ మాటలు చెప్పి, స్నేహం పెంచుకుంటూ వారిని కిట్టీ పార్టీలకు ఆహ్వానిస్తుంది. పార్టీలో శీతలపానీయంలో మత్తుముందు కలిపి మద్యానికి బానిసలుగా చేస్తుంది. ఆ తర్వాత మద్యం త్రాగే చిత్రాలు, వస్త్రాలు మార్చుకునే సమయంలో నగ్న చిత్రాలు రహస్యంగా తీసి బెదిరింపులకు దిగుతోంది. హై ప్రొఫైల్ వ్యక్తులతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని వ్యభిచార కూపంలోకి నేడుతుంది. ఇటీవల ఒక యువకుడికి ఓ యువతి ఫోటోలు చూపించి లక్ష రూపాయలకు బేరం కుదుర్చుకుంది. ఆ యువతి విషయంలో జాప్యం జరగటంతో మహిళపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ యువతి మరో బాధితురాలతో కలిసి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటాను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సీపీ లోతుగా దర్యాప్తు చేయాలంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com