టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ విమర్శలు చేశారు. తనకు తాను పార్టీ పెట్టుకొని అధికారం సాధిస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని, మామ పెట్టిన పార్టీని, ట్రస్టును, సీఎం కుర్చీని బలవంతంగా లాక్కుంటే వారిని చంద్రబాబు అంటారని జగన్ ఎద్దేవా చేశారు. వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీ లాక్కున్న బాబును సమర్థిస్తున్న ఈనాడు, ఏబీఎన్, టీవీ5, పవన్ కళ్యాణ్ ను ఏమనాలని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లను నమ్మొద్దని ఆయన కోరారు.