ప్రస్తుతం చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆహారంలో లెమన్‌గ్రాస్ ఆయిల్ వాడటం వల్ల శరీరంలోని అధిక కొవ్వును తగ్గించుకోవచ్చు. ఈ నూనెను ప్రతి వంటకంలో సాధారణ నూనెగా వినియోగించకూడదు. దీన్ని ఆహారంలో ఉపయోగించాలనుకుంటే ప్రతిరోజూ 2 నుంచి 3 చుక్కలను మాత్రమే ఆహారంలో వాడాలి. ఈ ఆయిల్‌లో ఉండే టెర్పెనాయిడ్ సమ్మేళనాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పై ప్రభావం చూపి, కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.