కర్ణాటక మద్యం తరలిస్తూ చిత్తూరు వ్యక్తి ఉన్నికృష్ణ దొరికిపోయాడు. కొరియర్ వాహనాల్లో పైలటింగ్తో పక్కా ప్రణాళికతో మద్యం తరలిస్తున్న ముఠా గుట్టును గంగవరం పోలీసులు మంగళవారం రట్టు చేశారు. తనిఖీల్లో భాగంగా ద్విచక్రవాహనం, వెనుక వచ్చిన కార్పొరేటర్ కారులోని వ్యక్తులను విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. వీటి వెనుక కొరియర్ వ్యాన్‌ను తనిఖీ చేయగా భారీగా మద్యం నిల్వలు బయటపడ్డాయి. విచారణలో చిత్తూరు 38వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ ఉన్నికృష్ణ అనుచరులతో కలసి కొంతకాలంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్టు తేలింది. మొత్తం 100 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉన్నికృష్ణ సహా అతని అనుచరులు విక్టర్ జ్ఞానశేఖర్, జయప్రకాష్, లక్ష్మణ్, శ్యామ్, గణేష్, క్రాంతికుమార్‌ను అరెస్ట్ చేశారు.