మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజులను ఈ నెల 25 నుంచి డిసెంబరు 10లోగా చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. ఒక్కో విద్యార్థి రూ.125 చెల్లించాల్సి ఉంటుందని, నిర్దేశించిన గడువులోగా ప్రధానోపాధ్యాయులు పరీక్షల విభాగానికి జమ చేయాలని సూచించారు. ఈ గడువు దాటితే..11 నుంచి 20వ తేదీలోపు రూ.50, 21 నుంచి 25వ తేదీలోపు రూ.200, 26 నుంచి 30వ తేదీలోగా రూ.500 అపరాధ రుసుముతో కలిపి ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఫీజులతో పాటు విద్యార్థుల రోల్ వివరాలను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.