ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలాంటి సీఎం దొరకటం మన అదృష్టం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 08:29 AM

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం అదృష్టమని, వైయస్‌ జగన్‌ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని  మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. అయన మాట్లాడుతూ.... వైయస్‌ జగన్‌ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇవాళ జగనన్న అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు. ఆ రోజు పాదయాత్రలో పింఛన్లు రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచుతానని ఇచ్చిన హామీని అమలు చేస్తున్నారు. డీబీటీ ద్వారా ప్రతి లబ్ధిదారుడికి అవకాశం కల్పిస్తున్నారు. వైయస్‌ జగన్‌కు చంద్రబాబుకు పోలికే లేదు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు అని ఆశాభావం వ్యక్తపరిచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa