కేరళ ఎర్నాకులానికి చెందిన రఘు, ఉష అనే దంపతులు తమిళనాడు పళనిలోని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పళనిలో ఓ హోటల్ రూంలో గురువారం ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు తలుపులు బద్దలు గొట్టి మృతదేహాలను గుర్తించారు. బంధువుల టార్చర్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.