బాపట్ల జిల్లా టి. యన్. యస్. యఫ్ కార్యకర్తలు "సంక్షేమ హాస్టల్ పోరు బాట" కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం చీరాల పట్టణం లోని ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించి అక్కడి విద్యార్ధుల స్థితిగతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు వారికి తమ సమస్యలు చెప్పుకున్నారు భోజనం నాణ్యత సరిగ్గా లేదని ముఖ్యంగా అన్నం నాసిరకంగా ఉంటుందని వారు చెప్పారు. దోమల బెడద కూడా అధికంగా ఉందని, కాస్మోటిక్సు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలిపారు.
ఈ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి సలుపుతామని టి. ఎన్. ఎస్. ఎఫ్ నేతలు విద్యార్థులకు హామీ ఇచ్చారు. బాపట్ల పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మొవ్వా శరత్ చంద్ర, చీరాల సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహేంద్ర, వేమూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు బోరుగడ్డఆనంద్, ఉడతా దేవేందర్ బాలాజి , రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.