ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన పక్క దేశమైన దక్షిణ కొరియాతో మాటిమాటికీ కయ్యానికి కాలు దువ్వుతాడనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి కిమ్ సోదరి రిమ్ యో జోంగ్ చేరింది. దక్షిణ కొరియాపై ఆమె మండిపడింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు సహా ఆ దేశ నేతలంతా ఇడియట్స్ అని, అమెరికా విసిరే ఎముకల కోసం పరుగుతీసే అడవి కుక్కలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పలుమార్లు క్షిపణి పరీక్షలను నిర్వహించిన ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని దక్షిణ కొరియా విదేంశాంగ మంత్రి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలే ఆమె తిట్ల దండకానికి కారణమని తెలుస్తోంది.