బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంటి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది. అంతే కాకుండా దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 24 గంటలపాటు తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో వాతావరణం పొడిగా ఉంటుందని, వర్షం కురిసే అవకాశం లేదని తెలిపింది.