ఈ పంట నమోదు ధ్రువీకరణ పత్రాల వల్ల ఆయా పంటల కనుగోలు ప్రక్రియ, పంట నష్టపరిహారం, పంట ఇన్సూరెన్స్ మొదలగు వ్యవసాయానికి సంబంధించిన వాటికి ఈ పత్రాలు అన్ని విధాల ఉపయోగపడతాయని కొరిశపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలియజేశారు. శుక్రవారం నాడు ఆయన పమిడిపాడు లో రైతులకు ఈ పంట నమోదు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. రబీ సీజన్ కు సంబంధించి రైతులు తమ వేసిన పంటలను సకాలంలో ఈ పంటలో నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు.