కృష్ణాజిల్లా మచిలీపట్నంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా తో మాజీమంత్రి మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య నాని భేటీ అవటం జరిగింది. జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి జి ప్లస్ త్రీ గృహాలను పేద ప్రజలకు అందించే తరుణం లో పలు కీలక అంశాలపై చర్చించారు.
జి ప్లస్ త్రీ గృహాలు సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలైన రహదారులు డ్రైనేజీ తాగునీటి వసతి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే సీఎం పర్యటన అధికారికంగా ఖరారైన నేపథ్యంలో సభ ఏర్పాట్లపై చర్చించారు.