ప్రస్తుత కాలంలో డబ్బు ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే కొందరు డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేసి తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటూ ఉంటారు. కొన్ని టిప్స్ పాటించి మనీ సేవ్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. చాలామంది తమ లైఫ్ స్టైల్ ను చాలా పోష్ గా మెయింటెన్ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కుంటారు. కావున లైఫ్ స్టైల్ విషయంలో ఖర్చు తగ్గిస్తే మంచిది. అలాగే ప్రతి ఒక్కరూ సేవింగ్స్ ప్రారంభించాలి. దీనివల్ల సడన్ గా ఏదైనా సమస్య వస్తే దాని నుండి బయటపడవచ్చు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో బీమా అనేది ఎంతో అవసరం. హెల్త్ ఇన్యూరెన్స్ కు కొంత మొత్తం కేటాయింటడం ద్వారా, ఎమర్జెన్సీ సమయంలో పెద్ద మొత్తం ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదు.