కార్గో ఎగుమతుల వార్షిక సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నులకు పెంచేందుకు సాగరమాల కార్యక్రమం కింద రూ.91 కోట్లతో మంజూరు చేసిన కాకినాడ యాంకరేజి పోర్టు అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రాజా, వేణుగోపాలకృష్ణ, ఎంపీ గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.