మూడు రాజధానులకు మద్దతుగా సోంపేట మండలం కొర్లాం నుంచి ఇచ్ఛాపురం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజా ప్రస్థానం గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. విశాల దృక్పథంతో ఉన్న ప్రజలు విశాఖ వాసులు అని, ఏ విధంగా చూసుకున్నా రాజధానికి విశాఖ యోగ్యత ఉన్న నగరం అని అన్నారు. అన్ని విధాలుగా అనుకూలం అయినటువంటి నగరం, అంతటి కాస్మోపోలిటన్ ఎట్మాస్ఫియర్ ఉన్న నగరం కూడా ఇంకొకటి లేదు అని చెప్పారు. అదేవిధంగా రాజధానిగా విశాఖ ఏ విధంగా అనుకూలం అన్నది వివరించారు. మిగలినటువంటి ఆంధ్రప్రదేశ్ లో విశాఖను మించిన నగరం మరొకటి లేదు. కొందరి స్వార్థం కారణంగా ఇవాళ క్యాపిటల్ లేకుండా అయిపోయింది అని అన్నారు.