భూముల సమగ్ర సర్వే చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. భూసర్వే ద్వారా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందనే గొప్ప మనసుతో ఈ సీఎం వైయస్ జగన్ ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. భూముల రీసర్వే అత్యాధునిక పరికరాలతో పకడ్బందీగా కొనసాగుతోందన్నారు. దేశంలో ఇది ఒక ఆదర్శమైన నిర్ణయమన్నారు. వందేళ్ల క్రితం బ్రిటీష్ వారి కాలంలో భూముల సర్వే జరిగిందని, మళ్లీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో సమగ్ర సర్వే జరుగుతుందని చెప్పారు. 14 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏనాడు భూ సర్వే నిర్వహించలేదని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు, కొన్నిమీడియా సంస్థలు కలిసి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కలలు కన్నా మళ్లీ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమన్నారు. 2024 ఎన్నికల్లో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.