మున్సిపల్ సర్వీసులు పారదర్శకంగా ప్రజలకు అందాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం పురపాలక పట్టణాభివృద్ధిశాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ, సమస్యలపై సత్వర పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీర్ఘకాలంలో నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై దృష్టిపెట్టిన ప్రభుత్వం. ఇందు కోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తున్న పట్టణాభివృద్ధిశాఖ. ‘‘ఏపీ సీఎం ఎంఎస్’’ (ఏపీ కన్‌సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్) యాప్‌తో రియల్‌టైం మానిటరింగ్. మరో నెలరోజుల్లో ఈ యాప్ సిద్ధం అవుతుంది. రోడ్లపై గుంతలు, రోడ్లకు మరమ్మతులు, పచ్చదనం, సుందరీకరణ, వీధిలైట్లు, నిర్వహణ, పుట్‌పాత్స్, మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, భూగర్భ మురుగునీటి వ్యవస్థల నిర్వహణ, పబ్లిక్ టాయ్‌లెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ, ట్రాఫిక్ జంక్షన్లు, వాటి నిర్వహణ అంశాలపై యాప్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తారు. రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో ఈ మౌలికసదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చెయ్యాలని సూచించారు .