మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు తాడిపత్రి టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు చంద్రబాబును కలిశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన రోజు నుంచి ప్రభుత్వం తమను ఏ విధంగా వేధిస్తోందో కౌన్సిలర్లు చంద్రబాబుకు వివరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 58 అక్రమ కేసులు పెట్టారని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసిన వారిని వేధించారని... తమను కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని వాపోయారు. కౌన్సిలర్లను అనేక ప్రలోభాలకు గురిచేసి వైసీపీలో చేర్చుకునే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపించారు.