మేఘాలయలో మరో 48 గంటలు ఇంటర్నెట్ సస్పెన్షన్ ను పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అస్సాం-మేఘాలయ సరిహద్దు ప్రాంతాల్లో ఆరుగురు మృతి చెందిన అవాంఛనీయ ఘటన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. జైంతియా హిల్స్, ఈస్ట్ జైంతియా హిల్స్, ఈస్ట్ ఖాసీ హిల్స్, రి-భోయ్, ఈస్టర్న్ వెల్ట్ ఖాసీ హిల్స్, వెస్ట్ ఖాసీ హిల్స్, నైరుతి ఖాసీ హిల్స్ జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్ పొడిగించారు. సామాజిక మాధ్యమాలు శాంతి భద్రతలను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు.