జనసేన పార్టీ పొత్తుల గురించి వస్తున్న ఊహాగానాలపై ఆ పార్టీ నేత, PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. తమ పార్టీ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటే ధైర్యంగా చెబుతామని, అలా చెప్పే దమ్ము, ధైర్యం తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్నాయని, ఇందులో భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తమ పార్టీలపై కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జనసేన ఎదుగుదలను చూసి రెండు పార్టీలకు భయం పట్టుకుందని అన్నారు. పారదర్శక రాజకీయాలకు జనసేన పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని నాదేండ్ల మనోహర్ వెల్లడించారు.