ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనాల ధరలు పెంచిన హీరో మోటో కార్ప్

business |  Suryaa Desk  | Published : Sat, Nov 26, 2022, 08:45 AM

దేశీయ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వినియోగదారులకు షాకిచ్చింది. తమ బైక్ లు, స్కూటీలపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒక్కో వాహనంపై రూ.1500 మేర పెంచనున్నట్లు సంస్థ తెలిపింది. అంతేకాకుండా, వాహన మోడల్, విక్రయించే ప్రాంతాన్ని బట్టి ధరల పెంపు ఇంకా పెరగొచ్చని ప్రకటించింది. వాహన తయారీలో ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరల పెంపు తప్పడం లేదని కంపెనీ తెలిపింది. పెరిగిన ధరలు డిసెంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయని హీరో మోటోకార్ప్ తన ప్రకటనలో వెల్లడించింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com