హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని కోసం పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. దీంతో పోలీసు శాఖలోని వివిధ విభాగాల పోస్టుల భర్తీలో హోంగార్డులకు రిజర్వేషన్లు వర్తించనున్నాయి. కానిస్టేబుల్ పోస్టుల నియామకాల్లో కేటగిరీలవారీగా 5-25 శాతం వరకు రిజర్వేషన్లు ఉండనున్నాయి. కాగా, రెండు రోజుల్లో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.