ఫిఫా వరల్డ్ కప్ 2022 కు ఆతిథ్యమిస్తున్న ఖతార్ జట్టు వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది. గ్రూప్ దశలో జరిగిన మ్యాచుల్లో ఈక్వెడార్ తో 2-0 తేడాతో ఖతార్ ఓడింది. అలాగే సెనెగల్ తో 3-1 తో ఓడిపోయింది. దీంతో టోర్నీ నుండి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఖతార్ అవతరించింది. 92 ఏళ్ల ఫుట్ బాల్ ప్రపంచకప్ చరిత్రలో ఆతిథ్య దేశం ఇలా నిష్క్రమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గ్రూప్ ఏ లో నెదర్లాండ్స్ కు 4 పాయింట్లు ఉండగా, ఈక్వెడార్ కు 4 పాయింట్లు, సెనెగల్ కు 3 పాయింట్లు ఉన్నాయి. ఖతార్ కు మాత్రం ఒక్క పాయింట్ కూడా రాలేదు.