భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం వద్ద శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగం పూర్తయి 73 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పట్ల అంబేద్కర్ సేవలు, రాజ్యాంగ విలువలను కొనియాడుతూ ఆయన చిత్రపటానికి కడప మేయర్ సురేష్ బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు.