ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదంతో ఎత్తుకోవడంతో, అమరావతికి భూములిచ్చిన రైతులు ఉద్యమబాట పట్టారు. ఈ ఉద్యమం డిసెంబరు 17తో మూడేళ్ళు పూర్తవుతుంది.ఈ నేపథ్యంలో ఇవాళ తుళ్లూరులో అమరావతి రైతులు సమావేశమయ్యారు. అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉద్యమానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa