సోమవారం శ్రీకాకుళం నగరం లోని 80 ఫీట్ రోడ్డు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంనకు రాష్ట్ర మైనార్టి ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పూలమాల వేసి శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనర్టీ ఉపాధ్యక్షులు అబ్దుల్ షాజహాన్ (సాతు ), జిల్లా మైనార్టీ అద్యక్షులు ముబారక్, జిల్లా మైనర్టి కార్య దర్శి రోషన్ బాషా, నియోజక వర్గ అద్యక్షులు షాను, ఉపాధ్యక్షులు సయ్యద్ షఫీ, సభ్యులు సలీమ్ పాల్గొన్నారు.