వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. విజయవాడలో డిసెంబర్ 8న భారీ ఎత్తున బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సైతం ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ మంత్రులు, నేతలు కీలక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ, వైయస్ఆర్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు.