పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకూ ప్రతి ఒక్కరికి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి ధర్మాన పెద్ద రెల్లి వీధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా ఈ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సాగింది. నేను పోటీచేసిన నాలుగు సార్లు ఈ వార్డు నాకు తోడుగా ఉన్నారు. మీ పట్ల నాకు ఎక్కువ బాధ్యత ఉంది. రూ.22.88 కోట్లు సంక్షేమం ఈ వార్డు ప్రజలకు గడించిన మూడున్నరేళ్లలో అందించాం. రాష్ట్రం మొత్తం మీద ఇదే పద్ధతి, అందుకోసమే ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు అని తెలియజేసారు.