కాబోయే పరిపాలన రాజధాని విశాఖపట్నంలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని టిటిడి చైర్మన్, వైయస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో కడప, విజయవాడల్లో మాత్రమే ప్రభుత్వ డెంటల్ కాలేజీలు ఉన్నాయని, విశాఖలోనూ డెంటల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ కోరగా, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి తగిన నిర్ణయం తీసుకుంటామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు కానున్న మెడికల్ కాలేజీల్లో పూర్తి స్థాయి డెంటల్ డిపార్ట్మెంట్ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కొన్నారు. డెంటల్ హెల్త్ పై ప్రజల్లో అవగాహన పెరగడంతో సిటీలోతో పాటు గ్రామీణంలో కూడా డెంటల్ ఆస్పత్రులు ఏర్పాటుతున్నాయని తెలిపారు.