రాజ్యాంగ పరిరక్షణ పేరుతో చంద్రబాబు విడుదల చేసిన లేఖ చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి పెద్ద లేఖ రాసిన చంద్రబాబుకు అధికారంలో లేనప్పుడు మాత్రమే రాజ్యాంగం, ప్రజల హక్కులు, బాధ్యతలు గుర్తుకువస్తాయని, అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్వప్రయోజనాలు, సొంతవారి ప్రయోజనాలే గుర్తుంటాయని చెప్పారు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని సీఎం వైయస్ జగన్ పరిరక్షిస్తున్నారా.. లేక టీడీపీ హయాంలో పరిరక్షించారా..? అనే విషయంపై చర్చకు వచ్చేందుకు చంద్రబాబుకు దమ్ముందా..? అని ప్రశ్నించారు. కాకినాడలో మాజీ మంత్రి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.