విద్వేషపూరితంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విషం చిమ్మడం, చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటం కోసం మాత్రమే పవన్ కళ్యాణ తాపత్రయపడుతారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పవన్ తెర మీద కంటే ఎక్కువగా తన నటనా కౌశల్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. ప్రతి ఎన్నికలోనూ తనకు బాగా అలవాటు అయిన వైయస్ఆర్సీపీని కూల్చేస్తా అంటూ మాట్లాడుతుంటాడు. ఎవరో సినిమా రైటర్ పవన్ కళ్యాణ్‌కు రాసిచ్చింది చదువుతున్నట్లున్నాడని విమర్శించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మరో సారి మైకు ముందు తన విపరీత నటనా కౌశల్యంతో తెలుగు ప్రజలందరినీ ఆహ్లదపరిచి తిరిగి విమానం ఎక్కేశాడు. ఆయన ప్రసంగంలో ఈ రాష్ట్ర ప్రజలకు పనికొచ్చేది దమ్మిడీ కూడా లేదు.