దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో 6 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థినులకు ప్రభుత్వాలు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మధ్యప్రదేశ్ కు చెందిన సామాజిక కార్యకర్త జయఠాకూర్ ఈ పిటిషన్ వేశారు. బాలికలకు శానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేకపోవడంతో చదువుపై ప్రభావం పడుతోందని కోర్టుకు తెలిపారు. దీనిపై విచారించిన ధర్మాసనం.. కేంద్రం, అన్ని రాష్ట్రాలకూ నోటీసులు జారీ చేసింది.