మన దేశ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా పాక్‌కు చెందిన డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చేశారు. పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చహర్‌పూర్ గ్రామ సమీపంలోని భారత భూభాగంలోకి డ్రోన్ ప్రవేశించడాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు చూశారు. వెంటనే కాల్పులు జరిపి దానిని కూల్చేశారు. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన అని బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. పాక్ నుంచి ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్‌ను సమర్ధంగా అడ్డుకుంటున్నట్లు వివరించింది.