గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో వున్న శ్రీ కన్వెన్షన్ హల్ కు, సీఎం జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు గురించి జిల్లా అధికారులతో సోమవారం ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద భద్రత, వీవీఐపి, రాకపోకలు సాగించే రహదారుల ఎంపిక మొదలగు వివిధ అంశాల గురించి అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.