దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవలకు అంతరాయం కలిగింది. నెట్ వర్క్ డౌన్ కావడంతో జియో ఇంటర్నెట్, కాల్స్, ఫైబర్ సేవలు నిలిచిపోయాయని పలువురు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. కాల్స్ చేసేందుకు, మాట్లాడేందుకు సైతం కుదరడం లేదని కామెంట్లు చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ కాల్స్ వాడుకుంటున్నారు. త్వరలోనే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.