అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు రోడ్డు ప్రమాదంలో దూరమైంది. దీంతో ఆ తండ్రి ఆమెకు గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. నెల్లూరు జిల్లా వెంకటాచలం.. కాకుటూరుకి చెందిన చెంచయ్య, లక్ష్మమ్మ దంపతుల నాలుగో కుమార్తె సుబ్బలక్ష్మి అటవీ శాఖలో ఉద్యోగి. ఒక రోజు లారీ ఢీకొని అన్న కళ్ల ముందే మరణించింది. దీంతో తల్లిదండ్రులకు దిక్కు తోచలేదు. ఈ క్రమంలో తండ్రి.. కూతురిపై ప్రేమతో 2011లో ఆమెకు గుడి కట్టి అప్పటి నుంచి రోజూ స్మరించుకుంటున్నాడు. తనకు కలలో తన కూతురు కనిపించి గుడి కట్టమని చెప్పిందని చెంచయ్య తెలిపాడు.