రాత్రి భోజనం చేసిన తర్వాత చేసే కొన్ని పొరపాట్లు నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రాత్రి తిన్నాక అలాగే కూర్చుంటే పొట్టలో గ్యాస్ వచ్చే ప్రమాదం ఉంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాక అలా జరుగుతుంది. దీని వల్ల సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అందుకే తిన్నాక కాసేపు నడిస్తే మంచిది. ఇక తిన్న తర్వాత ఎక్కువ నీరు తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌లు పలచబడి ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో కడుపు ఉబ్బరంగా మారుతంది. లేదా కడుపులో నొప్పి వంటి సమస్యలు వస్తాయి.