ఉల్లి విక్రయించబోతే ఓ రైతుకు కన్నీళ్లే మిగిలాయి. బెంగళూరులోని గడగ్ జిల్లా తిమ్మాపూర్ కు చెందిన పావాడెప్ప హల్లికేరి అనే రైతు యశ్వంత్ పూర్ మార్కెట్ లో 205 కిలోల ఉల్లి విక్రయించగా కేవలం రూ.8.36 మాత్రమే దక్కాయి. అంటే కేజీ ఉల్లి కేవలం రూ.25 పైసలే. మార్కెట్ కు తరలించడానికే రూ.25 వేలకు పైగా ఖర్చు చేసినట్లు సదరు రైతు తెలిపాడు. తనలాగే ఇతర రైతులు బెంగళరూలో పంట విక్రయించి మోసపోవద్దని పేర్కొన్నాడు. తనకు ఇచ్చిన రశీదును సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.