రాజస్థాన్ లోని కోటాలో ఓ మైనర్.. పాఠశాలలోని మరుగుదొడ్డిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ శిశువును నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు నవజాత శిశువును ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. బాధితురాలిపై 11 నెలలుగా 21 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడుతోన్న క్రమంలో ఆమె గర్భం దాల్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.