అన్యాయాల్ని ఎదిరించి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని శ్రీకాకుళం పార్ల మెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఆమదాలవలసలో టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే నెల ఒకటి నుంచి చేపట్టనున్న ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంపై రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన సాంకేతి నిపుణులు వీడియో ప్రెజెంటేషన్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, ఈ విషయాన్ని తాను బాదుడే బాదుడు కార్యక్రమంలో గుర్తించానని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు ప్రజల మధ్యనే ఉంటూ వారికి చేరువై ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలని కోరారు.