జిల్లాకేంద్రంలోని ఏపీ ఎన్జీవో సంఘం భవనంలో ఈ నెల 30న ఎన్జీవో పార్వతీపురం యూనిట్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం ఎన్నికల అధికారి కె.ఆదిలక్ష్మి సోమవారం తెలిపారు. స్థానిక విలేఖర్లతో ఆమె మాట్లాడుతూ... ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పార్వతీపురం పట్టణానికి చెందిన ఎన్జీవోలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa