ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. సీఎంవో పూనం మాలకొండయ్యను స్పెషల్ సీఎస్‌గా, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన్‌రెడ్డిని, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్‌ప్రకాశ్‌ను బదిలీ చేసింది. సెలవుపై వెళ్లిన బుడితి రాజశేఖర్ సెలవుపై తిరిగొచ్చాక జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్ అండ్ బీ కార్యదర్శిగా ప్రద్యుమ్న, వ్యవసాయ కమిషనర్‌గా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్లను ప్రభుత్వం నియమించింది.