తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఏలూరు, గోదావరి జిల్లాల్లో బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వైసీపీ శ్రేణులు, కమ్యూనిస్టు వ్యతిరేక సంఘాలు చంద్రబాబు పర్యటనకు ఆటంకాలు కలిగించే అవకాశం ఉందన్నారు. పర్యటనకు ఏలూరు పోలీసుల అనుమతి తీసుకున్నామని వర్ల రామయ్య స్పష్టం చేశారు. చంద్రబాబు పర్యటన సజావుగా సాగేలా చూడాలని డీజీపీని కోరారు.