ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారు ఇక విద్యను మాత్రమే బోధిస్తారు...టీచర్లకు కొత్త మార్గదర్శకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 29, 2022, 07:02 PM

విద్యా శాఖ పరిధి కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలను ఇవ్వకూడదని వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇకపై ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం కానున్నారు. 


మంగళవారం వర్చువల్ గా భేటీ అయిన ఏపీ కేబినెట్ సమావేశం పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ వెలువరించింది. ఉపాధ్యాయులు బోధనేతర విధులకు నిషిద్ధమని విద్యా హక్కు చట్టం చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీచర్లను బోధనేతర కార్యకలాపాలకు వినియోగిస్తామని ఆ నోటిఫికేషన్ లో ప్రభుత్వం వెల్లడించింది. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com