బెంగళూరులో దారుణం జరిగింది. 22 ఏళ్ల కేరళ యువతి శుక్రవారం అర్థరాత్రి బైక్ టాక్సీని బుక్ చేసుకుంది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆమె గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత బైక్ దిగే పరిస్థితి లేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. తన స్నేహితుడికి ఫోన్ చేసి పిలిచి ఆ తరువాత వారిద్దరూ కలిసి ఆమెను సామూహిక అత్యాచారం చేశారు. మరుసటి రోజు ఆమె గాయాలతో ఆసుపత్రిలో చేరగా, వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.